ప్రజాశక్తి-అమరావతి : డిజిపి నియామకానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డిజిపి పోస్టుకు ఎంపిక చేయబోయే వారి పేర్లును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపడం లేదని, ద్వారకా తిరుమలరావు నియామకం ఆ విధంగానే జరిగిందని పిల్ దాఖలైంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. డిజిపి నియామకంపై యుపిఎస్‌సికి పేర్లు పంపేలా ఉత్తర్వులివ్వాలంటూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ పిల్ వేశారు. యుపిఎస్‌సి షార్ట్ లిస్ట్ చేసిన వారిలో ఒకరిని డిజిపిని నియమించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది తాండవ యోగేష్.. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షతన బెంచ్‌ను కోరారు. ఈ నెల 31తో డిజిపి పదవీకాలం ముగుస్తుందన్నారు. సీనియర్ అధికారిని తాత్కాలిక డిజిపిగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. న్యాయవాది వినతి తర్వాత పిల్‌ను బుధవారం విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.
