మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌

May 12,2024 16:09 #2024 election, #vijayanagaram

ప్రజాశక్తి-చీపురుపల్లి: విజయనగరం జిల్లాలోని మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రాలను పింక్‌ కేంద్రాలుగా గుర్తించింది. చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్న చీపురుపల్లి మండలంలోని మెట్టపల్లిలోని 165వ పోలింగ్‌ కేంద్రాన్ని పింక్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో మొత్తం 804 మంది ఓటర్లు ఉండగా అందులో అత్యధికంగా 525 మంది ఓటర్లు మహిళలే. దీంతో ఎన్నికల అధికారులు పింక్‌ పోలింగ్‌ కేంద్రంగా ఏర్పా ట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రానికి ముందు భాగంలో పింక్‌ రంగులు, పింక్‌ రంగు ఫ్లెక్సీలతో స్వాగతం బోర్డులు, పోలింగ్‌ కేంద్రంలో సిబ్బంది కూర్చునే కుర్చీలు నుంచి సర్వత్రా పింక్‌ రంగులోకి మార్చేశారు.

➡️