రాష్ట్రం నుంచి ముగ్గురికి చోటు

Jun 10,2024 08:15 #centeral ministers, #leaders, #TDP
  • టిడిపి నుంచి రామ్మోహన్‌, పెమ్మసాని, బిజెపి నుంచి శ్రీనివాస వర్మకు మంత్రి పదవులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురికి చోటు దక్కింది. టిడిపి నుంచి ఇద్దరు, బిజెపి నుంచి ఒక్కరు మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి పదవి చేపట్టడం ముగ్గురికి ఇదే తొలిసారి. టిడిపి నుంచి శ్రీకాకుళం లోక్‌సభ ఎంపిగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రిగా, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌, బిజెపి నుంచి నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్‌నాయుడు వరుసగా మూడు సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపిగా గెలుపొందారు. పెమ్మసాని గుంటూరు నుంచి, శ్రీనివాస వర్మ నర్సాపురం నుంచి తొలిసారి గెలుపొందారు.

పిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా..
కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, విజయలక్ష్మి దంపతులకు 1987 డిసెంబరు 18న శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో రామ్మోహన్‌నాయుడు జన్మించారు. 2012లో తండ్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లో ప్రవేశించి 2014 నుంచి వరుసగా మూడు సార్లు ఎంపిగా గెలిచారు. విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రారంభమైంది. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా పొంది లాంగ్‌ మిగతా 2లో

రాష్ట్రం నుంచి ముగ్గురికి చోటు
ఐస్లాండ్‌లో ఎంబిఎ పూర్తి చేశారు. 26 ఏళ్ల వయసులోనే ఎంపిగా గెలుపొందారు. టిడిపిలో ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు అరెస్టు సమయంలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ నుంచి 3.27 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

దేశంలోనే ఖరీదైన ఎంపిగా పెమ్మసాని
గుంటూరు జిల్లా తెనాలి మండలంలో బుర్రిపాలెం గ్రామంలో సాంబశివరావు, సువర్చ దంపతులకు 1976లో పెమ్మసాని చంద్రశేఖర్‌ జన్మించారు. వ్యాపార రీత్యా వారి కుటుంబం నరసరావుపేటలో స్థిరపడింది. 1993-94 విద్యాసంవత్సరంలో చంద్రశేఖర్‌ ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబిబిఎస్‌ విద్యను అభ్యసించారు. పిజి అమెరికాలో చదివారు. అక్కడే యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ పరీక్ష పూర్తిచేశారు. అమెరికాలో లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యు వరల్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను స్థాపించారు. 2014లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా, రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీటు దక్కలేదు. 2024లో గుంటూరు నుంచి 3,44,695 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అఫిడవిట్లో రూ.5 వేలకు పైగా ఆస్తులను ప్రకటించారు.
అలాగే బిజెపి నుంచి గెలుపొందిన శ్రీనివాస వర్మ రాష్ట్రంలోని బిజెపి ముఖ్యనాయకుల్లో కీలకంగా ఉన్నారు. నర్సాపురం నుంచి తొలిసారి పోటీ చేసి 2,76,802 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

➡️