ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటించనున్న వేళ … అధికారులు హైఅలర్ట్ విధించారు. మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. మోడికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క తెలిపారు. ఆదిలాబాద్ నుండి ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాని హెలికాప్టర్‌లో బయలుదేరి నాందేడ్‌కు, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఈరోజు ప్రధాని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి లు కలిసి ప్రధానికి స్వాగతం పలికారు. కాగా మోడి రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకున్నారు. ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియంను ఎస్పీజీ భద్రతా వలయంలో ఉంచారు. రెండువేల మంది సిబ్బందితో భద్రతతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేవారు. మోడి పర్యటన షెడ్యూల్‌లో … చివరి నిమిషంలో స్వల్ప మార్పు జరిగి ఒక గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభమైంది.
