చెవిరెడ్డిపై ‘పోక్సో’ కేసు ?

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ‘పోక్సో’ కేసు నమోదైనట్లు సమాచారం. దీనితో పాటు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం ఎల్లమంద గ్రామానికి చెందిన దళిత విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారన్న బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు, మరికొంతమంది వైసిపి నేతలపై కేసు నమోదైనట్లు చర్చ నడుస్తోంది. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు.

➡️