ప్రజాశక్తి – పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రమ్ వాల్ ప్లాట్‌ఫారం పనులను జలవనరులశాఖ అధికారులు మంగళవారం ప్రారంభించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌కు నడుమ, పాత డయాఫ్రమ్ వాల్‌కి సమీపంలో నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ప్లాట్‌ఫారంను నిర్మిస్తున్నట్లు ఇఇ సుధాకర్ తెలిపారు. వచ్చే జనవరిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా ప్లాట్‌ఫాం పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నడుమ మట్టి, ఇసుక నాణ్యతా పరిశీలన కార్యక్రమాలు చేపట్టామన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మెటీరియల్‌ను తరలించేందుకు వాహనాల రాకపోకల కోసం ఆ ప్రాంతంలో అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.