కొందరి హౌస్ అరెస్టు
పోలీస్ స్టేషన్‌కు మరికొందరి తరలింపు
నేటి విజయవాడ మహాధర్నాను భగం చేసేందుకు ప్రభుత్వ యత్నం
ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు విజయవాడలో సోమవారం తలపెట్టిన మహాధర్నాను భగం చేసేందుకు ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. పలువురి అంగన్‌వాడీలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడ బయలుదేరిన కొంతమందిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మరి కొంతమందిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలను అంగన్‌వాడీ యూనియన్లు, సిఐటియు ఖండించాయి. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజును విజయనగరంలోనూ, జిల్లా కమిటీ సభ్యులు కె.తులసిని కొత్తవలసలోనూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వైఎస్‌ఆర్ జిల్లా నుంచి విజయవాడ బయల్దేరిన 41 మంది అంగన్‌వాడీలను కడప, మైదుకూరు రైల్వేస్టేషన్లలో పోలీసులు అడ్డుకున్నారు. వారిలో 20 మందిని కడప, 21 మందిని మైదుకూరు పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమడ రైల్వేస్టేషన్ వద్ద ఏడుగురు అంగన్‌వాడీ కార్యకర్తలను, సిఐటియు నాయకుడు కె.సాంబమూర్తిని పోలీసులు అడ్డుకున్నారు. నిడగల్లులో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతిలక్ష్మిని, మక్కువలో అంగన్‌వాడీ మండల నాయకులు దాలమ్మను గృహ నిర్బంధం చేశారు. విజయవాడకు వెళ్తున్న అంగన్‌వాడీలను అల్లూరి జిల్లా గంగవరం మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని హౌస్ అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరుతున్న కార్వేటినగరం ప్రాజెక్టు అధ్యక్షులు విజయను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులో అంగన్‌వాడీలకు, సిఐటియు నాయకులకు నోటీసులు నోటీసులు ఇచ్చి వారిని హౌస్ అరెస్టు చేశారు.
అరెస్టులకు ఖండన
సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా తలపెట్టిన మహాధర్నాను భగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తునట్లు సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహాధర్నాను అడ్డుకోవాలని చూడడం సరైంది కాదని తెలిపారు. నిర్బంధ చర్యలను టిడిపి కూటమి ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ధర్నా చేసేందుకు తాము ఇప్పటికే అనుమతి కోరామని కె.సుబ్బరావమ్మ (ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్), జె లలిత (ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్), విఆర్ జ్యోతి (ఎపి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్) తెలిపారు. నిర్బంధ చర్యలను ప్రభుత్వం ఆపి మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరారు.
నేడు మహాధర్నా
పోలీసుల నిర్బంధం అడుగడుగునా కొనసాగినా..అంగన్వాడీల మహాధర్నా సోమవారం ఉదయం 10.30 విజయవాడలోని ధర్నా చౌక్‌లో ప్రారంభమవుతుందని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు అంగన్వాడీ అనుబంధ సంఘాలు ఆదివారం ప్రకటించాయి. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఉత్తర్వులు సవరించడం, మిని సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ, 42 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ మహాధర్నా చేపట్టినట్లు ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి జె.లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర కార్యదర్శి వి.ఆర్.జ్యోతి సంయుక్తంగా ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా శంకవరం మండలం ఐ సి డి ఎస్ పరిధిలో సుమారు 30 మంది అంగన్వాడీలను విజయవాడ వెళ్లకుండా అన్నవరం రైల్వే స్టేషన్ లో నిర్బంధించిన పోలీసులు.
నంద్యాల జిల్లా : హక్కుల సాధనకై చలో విజయవాడ కార్యక్రమానికి తరలిపోతున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్బంధించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా నిరసనగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ డి.ఎస్.పి ఆఫీస్ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
మహాధర్నాకు వెళుతున్న అంగన్వాడీ వర్కర్స్ ని అరెస్టు చేయడం దారుణం
సిఐటియు ధర్నా
తిరుపతి జిల్లా – పుత్తూరు టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని తలపెట్టిన ఆందోళన సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుత్తూరు సిఐటియు కార్యదర్శి ఆర్ వెంకటేష్, పుత్తూరు ప్రాజెక్టు అంగన్వాడి వర్కర్స్ హౌస్ అరెస్టు చేయడం దారుణమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రజాస్వామ్యం పద్ధతులు ఆందోళన చేయడానికి రేపు వెళుతున్న విజయవాడ ధర్నా జయప్రదం చేయడానికి వెళుతున్న అంగన్వాడి వర్కులను సిఐటియు నాయకులను నిర్బంధించడం దారుణమన్నారు. వేతనాల పెంచాలని అదేవిధంగా గత ప్రభుత్వంలో 42 రోజులపాటు సమ్మె చేసి సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిడిపి నాయకులు ప్రజాప్రతినిధులు అంగన్వాడి సమస్యలను పరిష్కరిస్తామని గతంలో టిడిపి నాయకులు వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కుతున్నారన్నారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, డిమాండ్ చేశారు. న్యాయమైన కోర్కెల కోసం రేపు విజయవాడలో మహాధర్నాకు శాంతియుతంగా పోరాటం చేయడానికి వెళుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్లను సిఐటియు నాయకులు హౌస్ అరెస్ట్ దారణమన్నారు. అరెస్టులతో ఉద్యమంలో ఆపలేరని ఆయన అన్నారు.
చిత్తూరు జిల్లా కార్వేటినగరం ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయను గృహ నిర్బంధం చేయడం దారుణమని పోలీసులు తీరును యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు తీవ్రంగా ఖండించారు.
విజయనగరం టౌన్
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సోమవారం తలపెట్టిన విజయవాడలో మహాధర్నా సందర్భంగా విజయనగరం జిల్లాలో అంగన్వాడి వర్కర్స్ ను లీడర్స్ ను హౌస్ అరెస్ట్ చేయడo , నిర్బంధించడం వంటి చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారు. నగరంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు ఇంటికి వెళ్లి హౌస్ ఆరెస్ట్ చేశారు. అదే విధంగా జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో అరెస్టులు చేస్తున్నారు.
అంగన్వాడీ లను అరెస్టులు చేయడాన్ని సీఐటీయూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదరిలు పి.శంకర్రావు, కె.సురేష్ ఖండించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయడానికి రేపు విజయవాడ అలంకార సెంటర్ వద్ద ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ జిల్లాలో అంగన్వాడి వర్కర్స్ ను పోలీసులు ద్వారా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా అధికారులతో ఇబ్బంది పెట్టడం సరింది కాదని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం 26 వేల జీతం పెంచితే ఇలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం వుండదు కదా ఆని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు మానుకొని జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి వర్కర్స్ కి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అనీ హెచ్చరించారు.
అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మన్యం జిల్లా కార్యదర్శి గంట జ్యోతిలక్ష్మి ని హౌస్ అరెస్ట్