అంబేద్కర్‌ స్మృతి వనంలో సిపిఎం బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: విజయవాడ పిడబ్ల్యుడి గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించడానికి వెళ్తున్న సిపిఎం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనాన్ని పిపిపి పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించవద్దని డిమాండ్‌ చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్మృతి వనంలో ర్యాలీ చేపట్టారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విజయవాడలోని పిడబ్ల్యుడి గ్రౌండ్‌లో స్మృతి వనంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనాన్ని పిపిపి పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్‌ స్మృతి వనాన్ని కాపాడుకుందాం అని నినాదాలు చేస్తూ, ర్యాలీ చేశారు. స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనాన్ని పిపిపి పద్ధతిలో నిర్వహించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం లేఖ రాశారు.

 

 

 

➡️