రికార్డులు చూపించే లోపే చితకబాదిన సిఐ
బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ (అన్నమయ్య జిల్లా)
లారీ డ్రైవర్ పై పోలీసు జులుం ప్రదర్శించారు. రికార్డులు చూపించే లోపే లాఠీలకు పని చెప్పి చితకబాదాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లి రూరల్ మండల పరిధిలో జరిగింది. బాధితుడి కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఎంఎస్ నాసిర్ హుస్సేన్ కదిరికి చెందిన ఓ షాపులో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లారీలో ఫ్లైవుడ్‌కు ఉపయోగించే ముడి సరుకును తమిళనాడుకు తరలిస్తుండగా రాత్రి విధుల్లో ఉన్న తాలూకా సిఐ కళా వెంకటరమణ స్థానిక బైపాస్ రోడ్‌లో లారీని ఆపి రికార్డులు తనిఖీ చేశారు. డ్రైవర్ రికార్డులు చూపిస్తుండగానే ఫైన్ కట్టాలన్నారు. తనకు ఆ విషయం తెలియదని ఓనర్ కు ఫోన్ చేసి మాట్లాడుతానని ఫోన్ చేయడంతో తనకే ఎదురు చెప్తావా అంటూ లారీ డ్రైవర్ నాసిర్ హుస్సేన్ పై విచక్షణ రక్తంగా దాడి చేసి చితకబాదాడు. దీంతో బాధితుడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. బుధవారం ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న చేస్తున్న సమయంలో బాధితున్ని విచారించగా విషయం విలువలోకి వచ్చింది. ఎమ్మెల్యే వెంటనే డిఎస్‌పి కొండయ్యనాయుడు కు సమాచారాన్ని అందించారు. అనంతరం మదనపల్లె లారీ అసోసియేషన్ సభ్యులు సిఐపై చర్యలు తీసుకోవాలంటూ డిఎస్‌పి కార్యాలయం ఎదుట బైఠాయించారు. డిఎస్‌పి జోక్యం చేసుకుని మరోసారి ఇలా జరగకుండా చూస్తామని, సిఐతో క్షమాపణ చెప్పించడంతో సమస్య సద్దు మణిగింది.
