బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లికి పోలీసులు నోటీసులు

Mar 13,2025 08:12 #notices, #police

హైదరాబాద్‌ : బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. మాదాపూర్‌లోని ఇంటికి చేరుకున్న పోలీసులు మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాల కేసులో ఈ నోటీసులు అందజేశారు. రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు లాయర్‌ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే.

➡️