దేశవ్యాప్తంగా 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌

May 13,2024 12:52 #country, #Polling, #recorded

అమరావతి : ఎపి, తెలంగాణల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఎపిలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 9.05 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరోవైపు … దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్‌ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్‌ వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సగటున 10.35 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు.

వివిధ రాష్ట్రాల్లో 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌..
ఆంధ్రప్రదేశ్‌ – 9.21 శాతం
బీహార్‌ -10.18 శాతం
జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ – 5.07 శాతం
జార్ఖండ్‌ -11.78 శాతం
మధ్యప్రదేశ్‌ -14.97 శాతం
మహారాష్ట్ర – 6.45 శాతం
ఒడిశా – 9.23 శాతం
తెలంగాణ – 9.51 శాతం
ఉత్తర ప్రదేశ్‌ – 11.67 శాతం
వెస్ట్‌ బెంగాల్‌ – 15.24 శాతం

ఎపిలో 9 గంటల వరకు 9.21 శాతం పోలింగ్‌ నమోదు..
కడపలో 12.09 శాతం
చిత్తూరులో 11.84శాతం
బాపట్లలో 11.36 శాతం
అల్లూరిలో 6.77 శాతం
అనకాపల్లిలో 8.37 శాతం
అనంతపురంలో 9.18 శాతం
అన్నమయ్యలో 9.89 శాతం
కఅష్ణాలో 10.80 శాతం
కోనసీమలో 10.42 శాతం
నంద్యాలలో 10.32 శాతం
విశాఖలో 10.24 శాతం
ఏలూరులో 9.9 శాతం
ప.గో.లో 9.57 శాతం
నెల్లూరులో 9.51 శాతం
కర్నూలులో 9.34 శాతం
ప్రకాశంజిల్లాలో 9.14 శాతం
ఎన్టీఆర్‌ జిల్లాలో 8.95 శాతం
విజయనగరంలో 8.77 శాతం
తూ.గో.లో 8.68 శాతం
పల్నాడులో 8.53 శాతం
శ్రీకాకుళంలో 8.30 శాతం
తిరుపతిలో 8.11 శాతం
గుంటూరులో 6.17 శాతం
కాకినాడలో 7.95 శాతం
సత్యసాయి జిల్లాలో 6.92 శాతం
మన్యంజిల్లాలో 6.30 శాతం

తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్‌ నమోదు..
ఆదిలాబాద్‌లో 13.22 శాతం
జహీరాబాద్‌లో 12.88 శాతం
నల్గండలో 12.80 శాతం
ఖమ్మంలో 12.24 శాతం
మహబూబాబాద్‌లో 11.94 శాతం
మెదక్‌లో 10.99 శాతం
నిజామాబాద్‌లో 10.91 శాతం
భువనగిరిలో 10.54 శాతం
మహబూబ్‌నగర్‌లో 10.33 శాతం
కరీంనగర్‌లో 10.23 శాతం
నాగర్‌కర్నూల్‌లో 9.81 శాతం
పెద్దపల్లిలో 9.53శాతం
వరంగల్‌లో 8.97 శాతం
చేవెళ్లలో 8.29 శాతం
మల్కాజ్‌గిరిలో 6.20 శాతం
హైదరాబాద్‌లో 5.6 శాతం
సికింద్రాబాద్‌లో 5.40 శాతం
ఉప ఎన్నికలో..
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 6.28 శాతం

➡️