- ఆదోని కేసులో బెయిల్
ప్రజాశక్తి-కర్నూలు : డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్‌ను దూషించారని నమోదైన కేసులో పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు ఊరట లభించింది. మంగళవారం కర్నూలు జెఎఫ్‌సిఎం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్ పిఎస్‌లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న ఆయనపై కేసు నమోదైంది. ఈనెల నాలుగున కర్నూలు జిల్లా త్రీ టౌన్ పోలీసులు కర్నూలు జెఎఫ్‌సిఎం కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌లో సుదీర్ఘ వాదనల అనంతరం సోమవారం పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో వైసిపి లీగల్ సెల్ వేసిన బెయిల్ పిటిషన్‌ను అనుమతిస్తూ మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.