ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై సిఐడి నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్‌పై బుధవారం గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. పోసాని తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ… ఈ కోర్టు తప్ప అన్ని కోర్టులలో బెయిల్ వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, మెడికల్ గ్రౌండ్స్‌లో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సిఐడి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ… ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సరికాదని, బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 21వ తేదీకి తీర్పును వాయిదా వేశారు.
