POST – ‘సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా’ : కెటిఆర్‌

Apr 13,2025 12:31 #KTR, #post, #Supreme Court verdict

తెలంగాణ : గవర్నర్ల నిర్ణయాలకు కాలపరిమితిని నిర్దేశించిన సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. పాలనలో అడ్డంకులు సృష్టించడానికి బిజెపి, కాంగ్రెస్‌ జాతీయ పార్టీలు లెక్కలేనన్ని సార్లు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశాయన్నారు. అసెంబ్లీ స్పీకర్లతో రాజ్యాంగ దుర్వినియోగాన్ని కూడా.. సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి నిర్ణయించాలని ఎక్స్‌లో కెటిఆర్‌ పేర్కొన్నారు.

➡️