‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా

Feb 3,2025 22:07 #adjourned, #Fee battle, #March 12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం వైసిపి తలపెట్టిన ‘ఫీజు ఫోరు’ను ఈ నెల 5వ తేదీ నుంచి మార్చి 12వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో మెజార్టీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ‘ఫీజు ఫోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరినా, ఎటువంటి స్పందన రాలేదని తెలిపింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం మార్చి 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

➡️