నిరసన కార్యక్రమాలు వాయిదా

  • ఎపిపిటిడి ఎంప్లాయిస్‌ యూనియన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిపిటిడి (ఆర్‌టిసి) ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఈ నెల 19, 20 తేదీల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఎపిఎస్‌ఆర్‌టిసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ తెలిపింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని రవాణాశాఖ మంత్రి ఎం రాంప్రసాద్‌ రెడ్డి హామీ ఇచ్చినట్లు యూనియన్‌ అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.. ఈ నేపధ్యంలో నిరసన కార్యక్రమాలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

➡️