ఐఎఎస్‌ల ఇంటర్వ్యూల ఎంపిక వాయిదా

May 31,2024 08:31 #IAS, #interviews, #postponement, #selection

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నాన్‌ కేడర్‌ ఐఎఎస్‌ల ఎంపిక ప్రక్రియను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) వాయిదా వేసింది. జూన్‌ 6న జరగాల్సిన ఇంటర్వ్యూలను జూన్‌ 25 వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఐఎఎస్‌ల ఎంపిక ఇంటర్వ్యూలను జూన్‌ 6న నిర్వహించాలని కొంతమంది అధికారుల పేర్లతో కూడిన లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి యుపిఎస్‌సికి రాశారు. అయితే ఈ అంశం రాజకీయంగా వివాదం రేపింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని యుపిఎస్‌సి ఛైర్మన్‌కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.

➡️