ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

Aug 31,2024 17:30 #70 gates, #lifting, #praakasam barrage
prakasam barrage gates release

విజయవాడ: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉదృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి పైవంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు.

➡️