ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.1.71 లక్షల కోట్లు కేటాయించడంపై శనివారం విడుదల చేసి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం, మఖానా బోర్డు, నేషనల్ కాటన్ మిషన్, జాతీయ విత్తన మిషన్ ఏర్పాటు, యూరియా కొరత తగ్గించేందుకు చర్యలు, పరోక్షంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయించడంతో ప్రధాని వికసిత్ భారత్ సాధన లక్ష్యానికి మరింత దగ్గరైనట్లయ్యిందని పేర్కొన్నారు.
