రోడ్డు ప్రమాదంలో ఖైదీ మృతి

Jun 8,2024 21:30 #anathapuram, #khaid death

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలో ఆరుబయలు ఖైదీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లక్ష్మీపేటకు చెందిన ఉప్పర ఈరన్న(48) ఓ కేసులో శిక్ష పడి బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సమీపంలోని అనంతపురం జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆరు బయలు ఖైదీగా ఉంటూ సబ్‌జైలు ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్‌ బంకులో పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చేందుకు జైలు ఎదురుగా ఉన్న రోడ్డును దాటుతుండగా రెడ్డిపల్లి నుంచి అనంతపురం వైపు వెళ్తున్న టిప్పర్‌ ఢకొీంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈరన్న అక్కడికక్కడే మరణించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️