చంచల్‌గూడ జైలులో ఖైదీ మృతి..

Feb 12,2024 15:32 #death, #hyderabad

హైదరాబాద్‌ : చంచల్‌ గూడ జైల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సెల్‌ఫోన్‌ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న కిస్మత్‌ పూర్‌కు చెందిన రాజును నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైన రాజును పోలీసులు ఉస్మానియా హస్పటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం రాజు చనిపోయాడు. దీంతో జైలు అధికాకారులు రాజు మతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రాజు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రాజు మృతదేహన్ని ఉస్మానియా హస్పటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️