అమరావతి : ఏపీలో ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఇచ్చినట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. ఆ కార్డు నమూనాను కళాశాలలకు పంపించారు. వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు తెల్లరంగు, జనరల్లో ప్రథమ సంవత్సరం వారికి లేత పసుపు, రెండో ఏడాది వారికి లేత నీలం రంగు కార్డులను ముద్రించి, ఇవ్వాలని కృతికా శుక్లా సూచించారు.
