దగ్గుబాటి ప్రచారానికి నిరసన

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అనంతపురంలో న్నికల ప్రచారాన్ని దగ్గుబాటి ప్రసాద్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా గుత్తి రోడ్డులో ఎన్నికల ప్రచారంలో ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ రాలేదన్న ఆయన వర్గీయులు ‘ప్రసాద్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పోలీసులు జోక్యంతో వివాదం సర్దుమనిగింది. ప్రభాకర్ చౌదరి కాకుండా మరొకరు ఎన్నికల ప్రచారం చేస్తే ఊరుకోం.. అంటూ ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కచ్చితంగా అధిష్టానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

➡️