ప్రజాశక్తి-నక్కపల్లి : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని మత్స్యకారులు నిరసన చేశారు. తమ జీవితాలను నాశనం చేసే డ్రగ్స్ పార్క్ వద్దంటూ… నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా నిలిచిన సిపిఎం నాయకులను అరెస్టు చేసే ప్రయత్నం చేయగా, పెద్ద ఎత్తున మత్స్యకారులు పోలీసులను అడ్డుకున్నారు. మత్స్యకారులతో కలిసి నిరసన తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, నాయకులు శంకర్రావు, సత్యనారాయణ, రాజేష్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
నక్కపల్లిలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, ఆర్. శంకరరావు, రాజేష్, సత్తిబాబులు అరెస్ట్
రాజయ్యపేటలో ఆందోళనకారులను పోలీసులు స్టేషన్కు తరలిస్తుండగా, పోలీసులు వాహనానికి అడ్డంగా బైఠాయించిన మత్స్యకారులు