నిజాలను నిర్భయంగా రాస్తున్న ఏకైక పత్రిక
44వ వార్షికోత్సవ సభలో వక్తలు
ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్ : నేటి సమాజంలో ఉన్న పత్రికల్లో ప్రజాశక్తిది ప్రత్యేక స్థానమని, నిజాలను నిర్భయంగా రాస్తున్న ఏకైక పత్రిక అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రజాశక్తి 44వ వార్షికోత్సవ సభ శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎంఎల్ఏ విజయ్ చంద్ర, ప్రముఖ కవి గంటే డ గౌరు నాయుడు ఆవిష్కరించారు. అంతకు ముందు ప్రజాశక్తి వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాశక్తి సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.పోలినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడారు. నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తోందని అన్నారు. ప్రజలు బాగు పడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. వారిని చైతన్య వంతం చేస్తూ ముందుకు సాగుతోందని అన్నారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.
ఎం ఎల్ ఏ విజయ్ చంద్ర మాట్లాడుతూ44 ఏళ్ల పాటు నిరంతరాయం గాముందుకు సాగడం అభినందనీయం అన్నారు. ప్రజలు, ప్రభుత్వాల మధ్య సంబంధాలను మెరుగు పరచడంలో పత్రికలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక పత్రిక ఉన్న నేటి రోజుల్లో ప్రజాశక్తికి ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. స్వంతత్ర ఉద్యమంలో కూడా పత్రికలు కీలక పాత్ర పోషించాయి అని అన్నారు. పత్రికలు ప్రజలను చైన్యవంతం చేసి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి, సాహితివేత్త గంటేడ గౌరునాయుడు మాట్లాడుతూ పత్రికల్లో ప్రజాశక్తికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఈ సమాజం మార్పునకు ప్రజలను చైతన్య వంతం చేయడంలో కృషి చేస్తోందని అన్నారు. ప్రజలంతా ఈ పత్రికను మరింత ఆదరించాలని కోరారు. ఇంకా సభలో డి ఐ పి ఆర్ ఓ రమేష్, ప్రజా శక్తి చీఫ్ జనరల్ మేనేజర్ వై.అచ్యుతారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణ మూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, ప్రజాశక్తి జిల్లా మేనేజర్ సీహెచ్ రాము తదితరులు మాట్లాడారు.
