తెలంగాణ : దీపావళి పండుగ వేళ … తెలంగాణలోని పలుచోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. టపాసులు కాలుస్తూ పలువురు గాయపడటంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు 38 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. గాయాలపాలైనవారికి చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బఅందాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి మేజర్ కేసులు రాలేదని వైద్యులు తెలిపారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు.