- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రైల్వే ప్రైవేటీకరణ చర్యలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. విజయవాడ డివిజన్ 21వ ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ మహాసభ శుక్రవారం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సింగరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైల్వేలతో సహా అన్ని ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తుందన్నారు. ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా లోకో పైలెట్స్, కార్మిక సంఘాలు, ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ చేస్తున్న పోరాటాలకు సిఐటియు పూర్తి మద్దతునిస్తుందన్నారు. సభలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు వివిఎల్ నరసింహులు, ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ నాయకులు కె రామకృష్ణ, కెవిఆర్‌కె రాజు ప్రసంగించారు.
ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ విజయవాడ డివిజన్ అధ్యక్షులుగా వెంకటేషన్
ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ (ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ) విజయవాడ డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఎం వెంకటేషన్, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌వి రాము, ఉపాధ్యక్షులుగా కె రామకృష్ణతోపాటు మరో 20 మందిని నూతన కమిటీలో సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వివిఎల్ నరసింహులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ విజయవాడ బ్రాంచ్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్‌ఎన్‌వి రావు, బ్రాంచ్ సెక్రటరీగా గౌరీ ప్రసాద్, బ్రాంచ్ ట్రెజరర్‌గా కె శేఖర్‌ను ఎన్నుకున్నారు.