Rain Effect – గన్నవరం ఎయిర్‌పోర్టులో గాల్లోనే చక్కర్లుకొట్టిన విమానం

గన్నవరం (కృష్ణా) : సోమవారం కురిసిన భారీ వర్షానికి గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌ కష్టతరమయ్యింది. విమానాశ్రయంలో వరద నీరు భారీగా చేరుకోవడంతో … ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌ విమానం కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. వర్షం కారణంగా ల్యాండింగ్‌కు ఏటిసి అధికారులు అనుమతి ఇవ్వపోవడంతో పైలట్‌ విమానాన్ని కొద్దిసేపు గాల్లోనే తిప్పాల్సి వచ్చింది. ఆ తరువాత అధికారుల సూచనల మేరకు ల్యాండింగ్‌ చేశారు.

➡️