తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు

Aug 14,2024 16:35 #next five days, #rains, #Telangana

తెలంగాణ: తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం అవుతుంది. ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి, మేఘావృతమైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి.

➡️