గుండెపోటుతో ప్రజాశక్తి మాజీ సబ్‌ ఎడిటర్‌ రాజశేఖర్‌ మృతి

ప్రజాశక్తి-విజయనగరం : ప్రజాశక్తి మాజీ సబ్‌ ఎడిటర్‌ మెట్ట రాజశేఖర్‌ (46) శనివారం గుండెపోటుతో మరణించారు. ఉదయం 7.30 గంటల సమయంలో తన భార్య నిద్రలేపేసరికి ఆయన అచేతన స్థితిలో ఉండడంతో వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. రాజశేఖర్‌ విజయనగరం, శ్రీకాకుళం డెస్క్‌ల్లో సుదీర్ఘకాలంపాటు పని చేశారు. తరువాత కొంతకాలం సత్యావిజన్‌ అనే స్థానిక పత్రికలో పని చేశారు. ఏడాది క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యారు. చికిత్స అనంతరం తన పనులు తాను చేసుకుంటున్న సమయంలో ఆకస్మాతుగా మృతి చెందారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజశేఖర్‌ మృతదేహాన్ని ప్రజాశక్తి విజయనగరం మేనేజర్‌ సిహెచ్‌ రాము, డెస్క్‌ ఇన్‌ఛార్జి పి.అప్పారావు, స్టాఫ్‌ రిపోర్టర్‌ కె.రమేష్‌ నాయుడు, సబ్‌ ఎడిటర్‌ కె.కృష్ణమూర్తి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. రాజశేఖర్‌ మృతికి ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌, సిజిఎం వై అచ్యుతరావు, బుకహేౌస్‌ ఎడిటర్‌ ఎంవిఎస్‌ శర్మ సంతాపం తెలిపారు.

➡️