అమరావతి : టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు వివిధ జిల్లాల్లో వర్మపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. గతంలో వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు శుక్రవారం వరకు పొడిగించింది. వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో రేపు విచారణ జరగనుంది. ఇక తనపై కావాలనే కేసులు పెడుతున్నారని పలు ఆధారాలతో వర్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో వారం క్రితం వర్మకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.