రమణయ్య హత్య కేసు.. పెన్‌ డౌన్‌కు రెవెన్యూ ఉద్యోగులు పిలుపు

Feb 12,2024 15:25 #Hatya, #ramanya, #tasildar

ప్రజాశక్తి-విశాఖ : విశాఖ రూరల్‌ ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఎమ్మార్వో హత్య జరిగి పది రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో రెవెన్యూ అసోసియేషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి పెన్‌ డౌన్‌కు రెవెన్యూ ఉద్యోగులు పిలుపినిచ్చారు. ప్రభుత్వం స్పందించే వరకు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. ఏమర్జెన్సీ కేసులు, పాత కేసులు తప్ప కొత్త వాటిని ప్రారంభించకూడదని ఉద్యోగులు నిర్ణయించారు. ఎమ్మార్వో కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. రమణయ్య పిల్లలకు చదువు, రమణయ్య భార్యకు గ్రూప్‌ 2 ఉద్యోగం కల్పించాలని పేర్కొంది. ఇక, రమణయ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

➡️