రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు : ప్రధాని మోడి

తెలంగాణ : రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడి, బిజెపి అగ్రనేత అమిత్‌ షా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, తెలుగు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు : ప్రధాని మోడి
”శ్రీ రామోజీ రావు గారు మరణించడం చాలా బాధాకరం. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడాయన. జర్నలిజం, సినీ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన్నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. ఆయన ఎప్పుడూ దేశాభివఅద్ధి కోసమే ఆలోచించేవారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.” అని ప్రధాని మోడి ట్వీట్‌ చేశారు.

 

➡️