రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత : వెంకయ్యనాయుడు

Jun 8,2024 08:40 #Ramoji Rao, #Venkaiah Naidu

తెలంగాణ : ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు (88) మృతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని.. అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

➡️