రామోజీరావు ప్రస్థానం ఇలా…

Jun 8,2024 11:14 #Ramoji Rao

కృష్ణా : కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్‌16 న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు.

Ramoji rao and his wife
 • 1947లో గుడివాడ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరి 1951 వరకు సిక్త్స్‌ ఫాం వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని ఓ యాడ్‌ ఏజన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు.
 • 19.08.1961లో తాతినేని రమాదేవితో వివాహం.
 • 1962లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
 • 1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్‌ స్థాపన.
 • 1965లో కిరణ్‌ యాడ్స్‌ ప్రారంభం.
 • 1967-1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్‌ పేరుతో ఎరువుల వ్యాపారం.
 • 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు.
 • 1970లో ఇమేజస్‌ అవుట్‌డోర్‌ అడ్వర్టయిజింగ్‌ ఏజన్సీ ప్రారంభం.
 • 1972-1973 విశాఖలో డాల్ఫిన్‌ హౌటల్‌ నిర్మాణానికి శ్రీకారం.
 • 21.06.1980లో త్రీస్టార్‌ హౌటల్‌గా డాల్ఫిన్‌ ప్రారంభం.
 • 10.08.1974లో విశాఖ ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభం.
 • 12.08.1974లో మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభం.
 • 1975 డిసెంబరు 17న ‘ఈనాడు’ హైదరాబాదు ఎడిషన్‌ ప్రారంభమైంది.
 • 03.10.1976లో సినీ ప్రేమికుల కోసం ‘సితార’ పత్రికను ప్రారంభించారు.
 • ఫిబ్రవరి 1978లో ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికల ప్రారంభం.
 • 09.02.1980లో ‘ప్రియా ఫుడ్స్‌’ ప్రారంభం.
 • 02.03.1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ సంస్థ ఏర్పాటు.
 • 1990లో ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ ప్రారంభం.
 • 1992-1993లో సారాపై సమరం. మధ్యంపై నిషేద ఉత్తర్వులు వచ్చేదాకా పోరు.
 • 1996లో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ స్థాపన
 • 27.01.2002లో ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్ల ప్రారంభం.
 • 20.06.2002లో ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ ప్రారంభం.
 • 14.04.2008లో సమాచార చట్టం కోసం ‘ముందడుగు’
 • 25.12.2014లో ప్రధాని మోదీ ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్‌ చేశారు.
 • 14.11.2015లో మరో నాలుగు ఈటీవీ ఛానళ్ల ఆరంభం.
➡️