రామోజీరావు పాడె మోసిన టిడిపి అధినేత చంద్రబాబు

Jun 9,2024 11:04 #carried, #chandrababu, #Ramoji Rao's

హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమయాత్ర స్మృతి వనం వద్దకు చేరుకుంది. ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరింది. అంత్యక్రియలకు టిడిపి అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాడె మోశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

➡️