రేపు అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

Jun 8,2024 10:41 #CM Revanth, #orders

హైదరాబాద్‌ : రామోజీ రావు మృతి నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీఎస్‌ ను ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య జరగనున్నాయి. కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అటు ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు మృతి పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు . తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అంటూ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ…కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.

➡️