ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, ఆయన సతీమణి శాంతిజ్యోతి వైసిపిలో చేరారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు బుధవారం వైసిపిలో చేరారు. గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిశోర్‌బాబు మాజీ ఐఆర్‌ఎస్ అధికారి. 2014లో టిడిపి తరపున ప్రత్తిపాడు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రావెల కిశోర్‌బాబుపై ఆరోపణలు రావడంతో చంద్రబాబు కేబినెట్ నుండి వైదొలిగారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరారు. జనసేన నుండి బిజెపిలో చేరిన రావెల కిశోర్‌బాబు 2023లో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇపుడు ఆయన వైసిపిలో చేరారు. ఆయనకు వైసిపి నుండి బాపట్ల పార్లమెంటు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసిపి ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి చుక్కా విల్సన్‌బాబు కూడా జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు.
