ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : ఆంధ్ర వైద్య కళాశాలలో 29 కాంట్రాక్టు, 71 అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.బుచ్చిరాజు మీడియాకు తెలిపారు. వీటిలో 10 కాంట్రాక్ట్ పోస్టుల మెరిట్ జాబితా, 71 అవుట్ సోర్సింగ్ పోస్టులకు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ జాబితా ఆంధ్ర వైద్యకళాశాల అధికారిక www.amc.edu.in నందు NIC website www.visakhapatnam.ap.gov.in [email protected] వెబ్సైట్ నందు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు 10 రోజులు గడువు ఇచ్చినట్లు తెలిపారు.