అన్ని ఫిర్యాదులనూ పరిష్కరిస్తాం – గ్రీవెన్స్‌లో మంత్రులు, టిడిపి నేతలు

Aug 8,2024 22:50 #grievances, #TDP leaders

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తమ వద్దకు వచ్చిన అన్ని ఫిర్యాదులనూ పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రులు, టిడిపి నేతలు తెలిపారు. టిడిపి కార్యాలయంలో గ్రీవెన్స్‌ కార్యక్రమం గురువారం కొనసాగింది. రోడ్లు, భవనాలశాఖ మంత్రి బిసి జనార్ధన్‌ రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్‌.. చినబాబు ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల నుంచి వచ్చిన వినతిపత్రాలు, సమస్యలను వారు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు సంబంధితశాఖ అధికారులకు పంపారు.

➡️