- నేడు, రేపు విజయవాడలో, ఎల్లుండి కర్నూలులో
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ పంపిణీ సంస్థలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై మంగళవారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) ఆధ్వర్యాన ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో, 10వ తేదీన కర్నూలులో జరగనుంది. ఎపిఇఆర్‌సి ఛైర్మన్ ఠాగూర్ రామ్‌సింగ్ అధ్యక్షతన విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్‌లో వ్యక్తిగతంగా ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. కర్నూలులో ఎపిఇఆర్‌సి కార్యాలయం నుంచి 10వ తేదీన ఆఫ్‌లైన్‌లో జరగనుంది. మూడు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అంశాలను పరిశీలించాక ఎపిఇఆర్‌సి మార్చి 31లోపు విద్యుత్ టారిఫ్ ప్రకటిస్తుంది. ఈ టారిఫ్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది.