ఓటు హక్కు నమోదు చేసుకోండి

on-removings-voters

చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసరు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వయస్సు నిండనున్న యువతీ, యువకులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసరు వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు. గతంలో ఓటు హక్కును నమోదు చేసుకోలేక పోయిన వారు, 29.10.24 నుంచి 28.11.24 వరకు నమోదు, అభ్యంతరాలు, కరెక్షన్స్‌ కోసం దరకాస్తులు చేసుకోవచ్చన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌ -2025కు సంబంధించి ముందస్తు రివిజన్‌ కార్యకలాపాల పురోగతిని జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహంచారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక శిభిరాలు నిర్వహించేందుకు, పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్దీకరణ 29.10.24న ప్రచురణ కోసం డ్రాప్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ తయారీ కోసం అన్ని కార్యకలాపాలను 05.10.24లోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. కొత్తగా ఓటర్ల లిస్టులో పేర్లను చేర్చడానికి ఫారం -6లో దరఖాస్తు చేసుకోవాలని, విదేశీ ఓటర్ల పేర్లను చేర్చడానికి ఫారం-6(ఎ)లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తొలగింపు/ఎంట్రీలను చేర్చడానికి అభ్యంతరాలు తెలిపేందుకు ఫారం-7 నింపాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఎలక్టోరల్‌ నివాసం మార్చడానికి, ఎంట్రీల సవరణ కోసం, ఎపిక్‌ రోల్‌/ప్లేస్‌మెంట్‌/పిడబ్ల్యుడి మార్కింగ్‌ ఫారమ్‌ -8లో దరకాస్తు చేయాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసరు వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

➡️