- ఎపి లారీ ఓనర్స్ అసోసియేషన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర సరిహద్దుల్లో వున్న చెక్‌పోస్టులను రద్దు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దులోని అన్ని చెక్‌పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మొదలైనందున అక్రమంగా నగదు రవాణా తనిఖీల కోసమే ఈ ఎన్నికలు ముగిసే వరకు చెక్‌పోస్టులు పని చేస్తాయని పేర్కొన్నారు. ఇకపై ఈ చెక్‌పోస్టుల్లో లారీలను ఆపి ఎలాంటి తనిఖీలు చేయరని, ఈ అంశాన్ని రాష్ట్రంలోని లారీ యజమానులు, డ్రైవర్లు గమనంలో వుంచుకోవాలని కోరారు.