ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంటెలిజెన్స్ మాజీ డిజి ఎబి వెంకటేశ్వరరావు పై గత ప్రభుత్వ హయాంలో మోపిన అభియోగాలను కూటమి ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. ఈ మేరకు జిఓ ఆర్‌టి నెంబరు 2197ను శనివారం విడుదల చేసింది. నిఘా పరికరాలు కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆలిండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా తనను అన్యాయంగా సస్పెండ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేశారంటూ సుప్రీంకోర్టును ఎబి ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీసు చివరి రోజున ఎబికి డిజిగా అప్పటి ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిజిగా బాధ్యతలు ఉదయం స్వీకరించి అదేరోజు సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. అప్పట్లో ఎబిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
