ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులుగా రూ.7,002.52 కోట్లు శుక్రవారం విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా రూ.1.73 లక్షల కోట్లు కేటాయించగా, అందులో రాష్ట్రానికి ఈ మొత్తం వచ్చింది. 2024 డిసెంబర్ నెలకు ఈ నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ప్రస్తుతం లోటుతో ఇబ్బందులు పడుతున్న ఖజానాకు ఈ నిధులు కొంతమేరకు ఊరట నివ్వనున్నాయి.