బోరుగడ్డ అనీల్‌కుమార్‌కు రిమాండ్‌ పొడిగింపు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్‌కమార్‌కు కోర్టు మరోసారి రిమాండ్‌ విధించింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న ఆయనను నరసరావుపేటలోని రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టులో బుధవారం హాజరుపర్చగా రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి ఎన్‌.గాయత్రి ఉత్తర్వులిచ్చారు. బోరుగడ్డ అనిల్‌కుమార్‌పై గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో ఇదే న్యాయస్థానం గత నెల 24న రిమాండ్‌ విధించింది.

➡️