నకిలీ న్యాయవాదుల పేర్లు తొలగింపు

May 17,2024 08:50 #Duplicate, #Lawyers Names, #remove

ప్రజాశక్తి-అమరావతి : నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చెలామణి అవుతున్న ఆరుగురిపై రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ వేటు వేసింది. వారిని న్యాయవాదుల జాబితా నుంచి తక్షణమే తొలగిస్తున్నుట్ల ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా, బొక్కావారి పాలానికి చెందిన పితాని లక్ష్మీభాయి, గుంటూరు నగరానికి చెందిన జొన్నకూటి సాంబశివరావు, గుంటూరు జిల్లా, సత్తెనపల్లికి చెందిన బిక్కి నాగేశ్వరరావు, మాచర్ల వెంకటేశ్వరరావు, విశాఖకు చెందిన తడ్డి వెంకట నాయుడు, కర్నూలు జిల్లాలోని గుండ్ల సింగవరానికి చెందిన కాటసాని సంజీవరెడ్డిని న్యాయవాదుల జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి బి పద్మలత గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా ఎన్‌రోల్‌ అయ్యారు. వీటిని బార్‌ కౌన్సిల్‌ తర్వాత గుర్తించింది. వారిని బార్‌ కౌన్సిల్‌ జాబితా నుంచి తొలగించాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఉత్తర్వులిచ్చింది.

➡️