వరంగల్ : వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో అనధికారిక నిర్మాణాలను అధికారులు తొలగించారు. జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులు శనివారం క్రెయిన్ సహాయంతో తొలగించారు. ఇందులో భాగంగా ఉదయం కోట చెరువు, బంధం చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువులలో ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించారు.
