ఓటర్ల లిస్టు నుండి ఐపిఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దంపతుల పేర్లు తొలగింపు

అమరావతి : డీజీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన భార్య పేర్లు ఓటర్ల లిస్టు నుండి తొలగించారని అధికారులు చెప్పడంతో పోలింగ్‌ బూత్‌ నుండి దంపతులిద్దరూ వెనుదిరిగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో నివసించే ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఆలూరి కవితకు లయోలా కళాశాల ప్రాంగణంలోని 59వ నంబరు పోలింగ్‌ కేంద్రంలో ఓట్లు ఉండేవి. ఓటు వేసేందుకు సోమవారం ఉదయం దంపతులిద్దరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా… జాబితాలో నుంచి వారిద్దరి పేర్లు తొలగించేసినట్లు ఉందని అధికారులు తెలిపారు. వారి పేర్లు ఉన్న చోట ”డిలీటెడ్‌” అని ఉందని చూపించారు. ఏబీవీ, ఆయన భార్య పేర్లు డిసెంబరు వరకూ జాబితాలో కొనసాగాయి. ఎలాంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండానే ఓటు తొలగించేశారని వెంకటేశ్వరరావు తెలిపారు.

➡️