గురువుల పట్ల గౌరవం తప్పనిసరి – సిఎం చంద్రబాబు

Jul 21,2024 21:59 #CM Chandrababu, #respect, #Teachers

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గురువుల పట్ల గౌరవం తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రామదూత స్వామి ఆధ్వర్యాన మంగళగిరి సికె కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన గురుపూర్ణిమ ఉత్సవంలో సిఎం పాల్గని, ప్రత్యేక పూజలు చేశారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేద వ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలన్నారు. ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

➡️